Asianet News TeluguAsianet News Telugu

#LalSalaam ‘లాల్‌సలామ్‌’బడ్జెట్ ఎంత, ఈ కలెక్షన్స్ తో ఎప్పటికి రకవరీ?

ఒక చిన్న గ్రామంలో రెండు మతలా మధ్య వైరం, దానికి క్రికెట్ పోటీ వంటి భావోద్వేగాలతో లాల్ సలామ్ తెరకెక్కించారు.

Rajinikanth Lal Salaam collected close to 9 Cr gross in India for two days? jsp
Author
First Published Feb 11, 2024, 2:32 PM IST | Last Updated Feb 11, 2024, 2:32 PM IST


లాస్ట్ ఇయిర్  ‘జైలర్‌’ సినిమా సూపర్ హిట్ జోష్‌లోనే ‘లాల్‌ సలాం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటించిన  ఈ సినిమా నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. లా  ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేక చతికిల పడ్డ ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. అయితే ఏమాత్రం ఆ బడ్జెట్ కి పోల్చటానికి కూడా వీలు లేని కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

 తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా దాదాపు  70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కింది.  అందులో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొంత రికవరీ జరిగినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా కష్టమే అనిపిస్తోంది.  యావరేజ్  స్దాయిలో కూడా బజ్ తెచ్చుకోలేక పోవటంతో చెప్పుకోదగ్గ ఓపినింగ్స్ రప్పించుకోలేదు. తెలుగులో అయితే  కలెక్షన్స్ వైజ్ కూడా చాలా పూర్ గా ఉంది. 

తమిళనాడులో ఈ సినిమాకు 3.6 Cr ఓపినింగ్ రోజు గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది. రెండో రోజు జంప్ అవ్వలేదు. అదే మెయింటైన్ అవుతోంది. రెండు రోజుల తమిళనాడు గ్రాస్ చూస్తే.. 7.25 Cr, మిగతా ప్రాతాలన్ని కలిపి గ్రాస్  1.6 Cr వస్తోంది. మొత్తం మీద రెండు రోజుల్లో ఇండియా మొత్తం మీద  9 Cr గ్రాస్ వచ్చింది. ట్రేడ్ పరంగా ఇవి చాలా డిజప్పాయింటింగ్ నెంబర్స్ కావటం విశేషం. 
 
  లాల్ సలామ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్  నిర్మించింది.  మొదట ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. లేకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు. కానీ ట్రైలర్, టీజర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటించారు.  ఒక చిన్న గ్రామంలో రెండు మతలా మధ్య వైరం, దానికి క్రికెట్ పోటీ వంటి భావోద్వేగాలతో లాల్ సలామ్ తెరకెక్కించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios