'కాలా'కు ఎన్టీఆర్ సినిమాకు లింక్!

rajinikanth kaala is similar to ntr andhrawala movie
Highlights

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రావాలా' గుర్తుందా?

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రావాలా' గుర్తుందా? ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న ఆంధ్రుల కష్టాలు చూసి చలించి, ఆగ్రహంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వ్యక్తి కథే 'ఆంధ్రావాలా'. అంతకు ముందు తమిళంలో వచ్చిన కమల్ హాసన్ 'నాయకుడు' ఓ రకంగా ఈ సినిమాకి స్ఫూర్తి. పా రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 'కబాలి' ఇంచుమించు ఇదే విధంగా వుంటుంది. అందులో మలేషియాలో తమిళుల కోసం పోరాడిన వ్యక్తిగా రజినీ నటించారు. 'కబాలి' తరవాత అదే దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇచ్చి రజినీ చేసిన సినిమా 'కాలా'. ఈ నెల 7న విడుదల కానుంది. 

అయితే... ఈ సినిమా 'కబాలి' టైపులో కాకుండా అచ్చంగా 'ఆంధ్రావాలా' టైపులోనే వుంటుందని సమాచారం. ముంబైలో రాజకీయ నాయకుణ్ణి రజినీ ఎదిరించడం, అక్కడ దక్షిణాది ప్రజల కష్టాలు చూసి చలించడం వంటి సన్నివేశాలన్నీ 'ఆంధ్రావాలా'లో ఎన్టీఆర్ పాత్రని తలపిస్తాయట. కాకపోతే... కొంచెం రజినీ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని మరింత హీరోయిజం వచ్చేలా రూపకల్పన చేశార్ట‌. ఇటీవలే సినిమా సెన్సార్ పూర్తయ్యింది. తమిళం కంటే తెలుగులో రెండు మూడు నిమిషాల నిడివి తక్కువ వుందని తెలిసింది. తెలుగు వెర్షన్ కోసం ఒక సన్నివేశం లేదా రెండు సన్నివేశాలు తీసేసి వుండొచ్చు.  

loader