ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే సినిమా ఇండస్ట్రీలో హడావుడి ఒక్కసారిగా మొదలవుతుంది. సినిమా షూటింగ్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పండగ సీజన్స్ లో సినిమాలను రిలీజ్ చెయ్యాలని అనుకుంటారు. ప్రస్తుతం సంక్రాంతి కోసం కొన్ని సినిమాల షూటింగ్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీనివాస్ర్ కాంబినేషన్ లో వస్తోన్న వినయ విధేయ రామ సినిమా అలాగే నందమూరి హీరో బాలకృష్ణ చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ సంక్రాంతికి రానున్నాయి. ఇక రెండు సినిమాల మధ్య పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని సంక్రాంతికి వద్దామనుకున్న కొంతమంది కుర్ర హీరోలు వారి సినిమాల రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. 

అయితే మెగా నందమూరి ఫైట్ లో రజినీకాంత్ కలవనున్నట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తోన్న పెట్టా సినిమా షూటింగ్ ను రజినీ ఈ మద్యే ఫినిష్ చేశాడు. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోతే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. 

ఇక మరోవైపు 2.0 సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి  ఫ్యాన్స్ కు తలైవా బ్యాక్ టూ బ్యాక్ కిక్ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. ఇక తెలుగులో సూపర్ స్టార్ మెగా నందమూరి ఫైట్ లో ఎంత వరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.