రజినీకాంత్ మార్క్ మూవీ పడితే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పేందుకు జైలర్ నిదర్శనం. ఈ చిత్రం కమల్ హాసన్ విక్రమ్ లైఫ్ టైం వసూళ్లను అధిగమించింది.
దశాబ్దాల అనంతరం కమల్ హాసన్ విక్రమ్ మూవీతో సత్తా చాటాడు. గత ఏడాది విడుదలైన విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 410 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళ, తెలుగు భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కి విక్రమ్ ఊహించని లాభాలు పంచింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ తెరకెక్కించారు. కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. విక్రమ్ చిత్రానికి వచ్చిన లాభాలతో అప్పులన్నీ తీర్చేస్తానని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించడం విశేషం.
కాగా కమల్ విక్రమ్ లైఫ్ టైం రికార్డు రజినీకాంత్ 6 రోజుల్లో అధిగమించాడు. ఆయన లేటెస్ట్ మూవీ జైలర్ వసూళ్ల వరద పారిస్తుంది. జైలర్ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ. 416 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మరో వీక్ స్ట్రాంగ్ రన్ కొనసాగేలా ఉన్న క్రమంలో జైలర్ భారీ ఫిగర్ నమోదు చేసేలా ఉంది. అందులోనూ సమీప కాలంలో జైలర్ కి చెప్పుకోదగ్గ పోటీ లేదు. పెద్ద చిత్రాల విడుదల లేదు.
జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేయడం విశేషం. రమ్య కృష్ణ, తమన్నా, సునీల్ కీలక రోల్స్ చేశారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ రజినీకాంత్ ప్రెజెన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను అద్భుతంగా మలిచాయి.
