సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కావేరి ఆసుపత్రిలో ఆయన గురువారం సాయంత్రం చేరిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు అఫీషియల్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హెల్త్ అప్‌డేట్‌ వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ప్రకటించారు. అయితే రజనీకాంత్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మెదడు రక్తనాళ్లల్లో బ్లాక్స్ గురించినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

రజనీకాంత్‌ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన హుఠాహుటిన ఆసుపత్రిలో చేరడంతో రజనీ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెగ్యూలర్‌ హెల్త్ చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లారని, ఆరోగ్యం బాగానే ఉన్నారని వైద్యలు, ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశారు. నిన్నటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అనేక పరీక్షల అనంతరం మెదడు రక్తనాళ్లల్లో బ్లాంక్స్ గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స జరుగుతుందన్నారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో `పెద్దన్న` పేరుతో విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. రజనీకి చెల్లిగా కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేష ఆదరణ పొందింది. 

మరోవైపు రజనీకాంత్‌ ఇటీవల ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్‌ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి నుంచి అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ అటు ప్రధాని నరేంద్రమోడీని, ఇటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలిసిన విషయం తెలిసిందే.