సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయన గురువారం చెన్నైలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కూతురు సౌందర్య దగ్గరుంచి రజనీకి వ్యాక్సిన్‌ వేయించారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయన గురువారం చెన్నైలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కూతురు సౌందర్య దగ్గరుంచి రజనీకి వ్యాక్సిన్‌ వేయించారు. రజనీకాంత్‌ షూటింగ్‌ నిమిత్తం ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన `అన్నాత్తే` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగింది. దాదాపు 35 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. దీంతో అప్పటి నుంచి రజనీ ఇక్కడే ఉన్నారు. 

బుధవారం హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తవడంతో ఆయన చెన్నై వెళ్లిపోయారు. వెళ్లిన ఒక్క రోజు గ్యాప్‌తోనే ఆయన రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. త్వరలో ఆయన అమెరికా వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. తన హెల్త్ సమస్యలకు సంబంధించి హెల్త్ చెకప్‌ కోసం రజనీ అమెరికా వెళ్లబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. 18ఏళ్లు పైబడిన వాళ్లు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రజనీ వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇక రజనీ నటిస్తున్న `అన్నాత్తే` సినిమాకి శివ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు, జగపతిబాబు నటిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌లో వీరిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.