Asianet News TeluguAsianet News Telugu

ఐశ్వర్య తప్పుగా ఏం మాట్లాడలేదు.. సమర్ధించిన రజినీకాంత్..

రీసెంట్ గా జరిగింది లాల్ సలామ్ ప్రీరిలరీజ్ ఈవెంట్. ఈఈవెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ప్రీరిలీజ్ లో డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. వాటిని రజినీకాంత్ సమర్ధించారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

Rajinikanth defends daughter Aishwarya She never said Sanghi was a bad word JMS
Author
First Published Jan 29, 2024, 4:44 PM IST


రిలీజ్ కు రెడీ అయ్యింది లాల్ సలామ్. స్పోర్ట్స్ డ్రామా కంటెంట్ తో తెరకెక్కిన ఈసినిమాలో  రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చెన్నైలో రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అంతే కాదు ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు.. రెహమాన్..  ఈసినిమా దర్శకురాలు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తో పాటు మూవీ టీమ్అంతా సందడి చేశారు. ఇక ఈక్రమంలో ఈవెంట్లో  రజినీకాంత్ ,ఆయన కూతురు ఐశ్వర్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దుమారాన్ని రేపుతున్నాయి. అయితే వాటిని రజినీకాంత్ సమర్ధించారు అందులో తప్పేమింది అన్నారు. అసలు విసయం ఏంటంటే.. 

ఈవెంట్ లో ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. ఐశ్వర్య ఎమెషనల్ అయ్యారు. తన తండ్రి రజనీకాంత్ పై వస్తోన్న ట్రోల్స్‌పై ఐశ్వర్య స్పందించారు. నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను, కానీ మా టీమ్ తరచుగా నాకు ఏమి జరుగుతుందో చెబుతుంది మరియు కొన్ని పోస్ట్‌లను చూపిస్తూనే ఉంటుంది. వాటిని చూసి నాకు కోపం వచ్చేది. మేము కూడా మనుషులమే. ఈ మధ్య కాలంలో , చాలా మంది మా నాన్నను సంఘీ అని పిలుస్తున్నారు.  దాని అర్థం ఏమిటో నాకు తెలియదు. అప్పుడు నేను సంఘీ అంటే ఏమిటి అని ఒకరిని అడిగాను, వారు ఫలానా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని సంఘీ అంటారు అని అన్నారు.

Rajinikanth defends daughter Aishwarya She never said Sanghi was a bad word JMS

రజనీకాంత్‌ సంఘీ కాదు. అలా అయితే ఆయన ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారు కాదు అని ఆమె పేర్కొన్నారు. ఐశ్వర మాటలకు సూపర్ స్టార్ కంటతడి పెట్టుకున్నారు. ఆతరువాత   రజనీకాంత్  మాట్లాడుతూ.. తనపై చాలా ట్రోల్స్ వస్తున్నాయని. జైలర్‌ ఈవెంట్‌లో ‘అర్థమైందా రాజా’ అన్న మాటను పట్టుకొని విజయ్‌పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ అని సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. 

ఈక్రమలో సంఘీ పదం వాడటంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఐశ్వర్యను విమర్షిస్తూ పోస్ట్ లు.. కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంతమ్ వివరణ అడిగింది మీడియా. ఓ షూటింగ్ నిమిత్తం బయటు వచ్చిన ఆయనను మీడియా మిత్రులు ప్రశ్నించగా ఈ విధంగా అన్నారు.నా కూతురు సంఘీ అనే పదం వాటంలో తప్పేముంది. అది చెడ్డ పదం కాదు కదా..? అయినా ఆమె తన తండ్రి బాధను వెల్లడించింది.  తన తండ్రి ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు ముద్ర వేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దాంట్లో తప్పేముంది అని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios