Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ ఇక మారరా... పెద్దన్న కూడా ఆ తరహా చిత్రాల వలె!

 కొన్నేళ్లుగా రజినీకాంత్ మూవీలు ఒకే విధంగా ఉంటున్నాయి. ఆయన సినిమాలలో మొనాటమి పెరిగిపోయిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

rajinikanth annaatthe teaser nothing new in it
Author
Hyderabad, First Published Oct 15, 2021, 11:17 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తే టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ రజిని డై హార్డ్ ఫ్యాన్స్ కి పిచ్చగా నచ్చేసింది. రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఓ వర్గం అన్నాత్తే టీజర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం గత కొన్నేళ్లుగా రజినీకాంత్ మూవీలు ఒకే విధంగా ఉంటున్నాయి. ఆయన సినిమాలలో మొనాటమి పెరిగిపోయిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది నిజమే అని చెప్పాలి. రజినీకాంత్ గత చిత్రాలు రికార్డ్స్ చూస్తే... దిగ్బ్రాంతి కలగడం. కోలీవుడ్ లో ఇప్పుడు సూపర్ స్టార్ ఎవరంటే విజయ్ లేదా అజిత్ పేరు వినిపిస్తుంది. అక్కడే కొత్తగా అవతరించిన హీరోలు వీరు. ఒకప్పుడు ఈ ఇద్దరు హీరోల పరిస్థితి, వాళ్ళ సినిమాల రికార్డ్స్ ఏమిటీ అంటే... రజినీకాంత్ సినిమాకు ఓ రోజు వచ్చిన కలెక్షన్స్ అంత కూడా అజిత్, విజయ్ చిత్రాలు బడ్జెట్ ఉండేది కాదు. 

Also read శ్రీయ శరన్ కిల్లింగ్ లుక్స్.. ఎంత అందంగా ఉందో కదా, ఆ విషయంలో మంచు లక్ష్మి సపోర్ట్

మరి ఇప్పుడు వాళ్ళు రజినీకాంత్ ని అధిగమించేశారు. ముఖ్యంగా హీరో విజయ్ కోలీవుడ్ లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆయన ఫాన్ ఫాలోయింగ్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే... రోబో చిత్రం తరువాత ఆయన క్లీన్ హిట్ కొట్టలేదు. ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. రోబో సీక్వెల్ 2.0 చేసినా, ప్రధమ భాగం అంత విజయం దక్కలేదు.

Also read బ్లాక్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న పూజా హెగ్డే.. బర్త్ డే ఫోటోలు..

ఇక తాజా చిత్రంలోనూ Rajinikanth గత చిత్రాలను పోలిన కథలనే ఎచుకున్నారని అనిపిస్తుంది. ఆయన మేనరిజం, స్టయిలే పేట, దర్బార్, కాలా చిత్రాలను తలపిస్తున్నాయి. రొటీన్ స్టోరీస్ తో రజినీకాంత్ రేసులో నెట్టుకురాగలరా అనిపిస్తుంది. ఇక తెలుగులో పెద్దన్న పేరుతో ఈ చిత్రం విడుదల అవుతుండగా... తెలుగులో శౌర్యం తెరకెక్కించిన దర్శకు శివ తెరకెక్కించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios