రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దాదాపు 16ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ పడబోతున్నారు. బాక్సాఫీసు వద్ద ఢీ కొనబోతున్నారు. వీరు నటించిన సినిమాలు ఒకేసారి విడుదలకు రెడీ అవుతుండటం విశేషం.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దాదాపు 16ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ పడబోతున్నారు. బాక్సాఫీసు వద్ద ఢీ కొనబోతున్నారు. వీరు నటించిన సినిమాలు ఒకేసారి విడుదలకు రెడీ అవుతుండటం విశేషం. రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్‌ దర్శకుడు. సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. కీర్తిసురేష్‌, నయనతార, మీనా, ఖుష్బు వంటి తారాగణం నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో రజనీ అనారోగ్యానికి గురి కావడం, చిత్ర యూనిట్‌లో కొందరికి కరోనా సోకడంతో షూటింగ్‌ని నిలిపివేశారు. ఇటీవల మళ్లీ షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. 

మరోవైపు యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు. తమిళనాడు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశాడు కమల్‌. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న `అన్నాత్తే`ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే యూనిట్‌ ప్రకటించింది. తాజాగా కమల్‌ కూడా అదే డేట్‌ని టార్గెట్‌ చేశాడట. ఇదే నిజమైతే దాదాపు 16ఏళ్ల తర్వాత వీరిద్దరు బాక్సాఫీసు వద్ద ఢీ కొనబోతున్నారని చెప్పొచ్చు. 

గతంలో 2005లో రజనీకాంత్‌ నటించిన `చంద్రముఖి`, కమల్‌ హాసన్‌ నటించిన `ముంబయి ఎక్స్ ప్రెస్‌` చిత్రాలు తమిళ సంవత్సరాదిన ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో కమల్‌ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. రజనీ చిత్రం `చంద్రముఖి` భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.