Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ సినిమా కన్ఫమ్.. ‘తలైవా171’పై అఫీషియల్ అనౌన్స్ మెంట్

రజినీకాంత్  - లోకేషన్ కనగరాజ్ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఎప్పుటి నుంచో ఈ చిత్రం అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా అధికారికి ప్రకటన వచ్చింది. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

Rajinikanth and Lokesh Kanagaraj film Thalaivar 171 confirmed by Sun Pictures NSK
Author
First Published Sep 11, 2023, 12:59 PM IST

కోలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయ్యింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నెక్ట్స్ సినిమాను సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)తో కన్ఫమ్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉండదా? అంటూ  ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సర్ ప్రైజింగ్ న్యూస్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే Thalaivar 171గా రూపుదిద్దుకోబోతంది. రజినీ- లోకేష్ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా కన్ఫమ్ అయ్యారు. 

ప్రస్తుతానికి సినిమాను అధికారికంగా ప్రకటించారు. త్వరలో కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన డిటేయిల్స్ ను అందించనున్నారు. అదే Sun Pictures  బ్యానర్ లోనే ఇటీ వల ‘జైలర్’ విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మళ్లీ ఇదే బ్యానర్ లో రజినీకాంత్ నటించడం విశేషం. అందులోనూ లోకేషన్ కనగరాజ్ రచన దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  

ప్రస్తుతం రజినీకాంత్ ‘లాల్ సలామ్‘, లైకా ప్రొడక్షన్ హౌజ్ లో ‘Thalaivar170‘ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటు లోకేష్ కనగరాజ్ ‘లియో’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ దళపతి - త్రిష జంటగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ వచ్చే నెల అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం.. ‘విక్రమ్’ లాంటి భారీ హిట్ అందుకున్నాక లోకేష్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో Leoపై తారా స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios