రీసెంట్ గా రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొంది రిలీజైన 2.0. చిత్రం సైతం తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజై మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా సెట్ పై ఉండగానే రజనీ మరో సినిమా మొదలెట్టేసారు. వెరైటీ చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి డైరక్షన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో బిజినెస్ కూడా మంచి ఊపు అందుకుంది.
తెలుగులోనూ ఈ సినిమా రైట్స్ కు పోటీ ఏర్పడిందని టాక్ . అయితే పోటీలో ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతూండటంతో రజనీకాంత్ చిత్రం ఏ మేరకు ఆదరిస్తారు..అనే సందేహం డిస్ట్రిబ్యూటర్స్ లోకలిగింది. ఈ నేపధ్యంలో రజనీ సినిమాకి ఆ మేరకు తీవ్రమైన పోటీ తప్పలేదు.
దాంతో పేట రిలీజ్ రైట్స్ విషయంలో బయ్యర్లు వెనకాడారని, ఆ క్రమంలోనే పేట రిలీజ్ హక్కుల్ని తక్కువ రేటుకే చేజిక్కించుకున్నారని ప్రచారం ట్రేడ్ సర్కిల్స్ లో సాగుతోంది. ఈ సినిమాని దాదాపు 10 నుంచి 12 కోట్ల మధ్యలో లాక్ చేసి చేజిక్కించుకున్నారని టాక్.
అయితే మరీ తక్కువ అని చెప్తే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురు అవుతాయని ఇరవై కోట్లవరకూ ఈ సినిమా రైట్స్ పై పెట్టారనే ప్రచారం మొదలెట్టారంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు. ఇక ఇప్పటికే తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత వల్లభనేని అశోక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, తనే అని కన్ఫర్మ్ చేసారు.
నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ “సూపర్ స్టార్ రజినీకాంత్ రొరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా తెరకెక్కిన ష`పేట` చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది.చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రజినీకాంత్ కు వీరాభిమాని.అందుకే రజినీకాంత్ ను అయన తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు.
అలాగే ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు ఆకట్టుకుంటాయి.అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్నమంచి చిత్రమిది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నాం` అన్నారు.
రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది. త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్, నిర్మాత: వల్లభనేని అశోక్.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 25, 2018, 6:38 PM IST