తమిళ చిత్ర పరిశ్రమలో కీలకమైన నడిఘర్ ఎన్నికలకు రజినీకాంత్ దూరంగా ఉన్నారు. దర్బార్ షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినట్లు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ సూపర్ స్టార్ కావాలని ఈ ఎలక్షన్స్ ని దూరం పెట్టినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

పోస్టర్ బ్యాలెట్ కూడా తనకు ఆలస్యంగా అందాయని అందుకే ఓటు వేయలేకపోతున్నట్లు సూపర్ స్టార్ వివరణ ఇచ్చారు. అయితే కోలీవుడ్ లో రెండు వర్గాల మధ్య జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఊహించడం కష్టంగా మారింది. అందువల్ల విశాల్ - భాగ్యరాజ్ వర్గాల్లో ఎవరికి మద్దతు ఇవ్వలేక రజిని సైడ్ అయ్యారని వినికిడి. 

గతంలో విశాల్ వర్గాన్ని సువర్ స్టార్ మెచ్చుకున్నప్పటికీ ఎలక్షన్స్ వివాదాలు మొదలైనప్పటి నుంచి తలైవా దూరంగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు సొంత ఇండస్ట్రీలో జరిగే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాల్సిన సూపర్ స్టార్ దూరంగా ఉండడం చర్చకు దారి తీస్తోంది. మరి ఈ పుకార్లపై సూపర్ స్టార్ కోలీవుడ్ జనాలకు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.