కొడుకు లిప్ లాక్.. రాజీవ్ కనకాల క్రేజీ కామెంట్.. సిగ్గుతో తలదించుకున్న సుమ
యాంకర్ సుమ కొడుకు సినిమా ఇలా ఉందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో టీజర్ చివర్లో రోషన్.. హీరోయిన్‌కి సముద్రంలో లిప్‌లాక్ పెట్టడమే ఓవర్ డోస్‌గా ఉంది.

యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా చేస్తున్నారు. దానికి `బబుల్‌గమ్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. నాని గెస్ట్ గా వచ్చి టీమ్‌ని అభినందించారు. అయితే టీజర్ మాత్రం చాలా బోల్డ్ గా ఉంది. శృతి మించిన బూతు డైలాగ్‌లతో నింపేశారు.
యాంకర్ సుమ కొడుకు సినిమా ఇలా ఉందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో టీజర్ చివర్లో రోషన్.. హీరోయిన్‌కి సముద్రంలో లిప్‌లాక్ పెట్టడమే ఓవర్ డోస్‌గా ఉంది. దీనికి తోడు విలన్‌కి హీరో పరమ బూతు పదంతో వార్నింగ్ ఇస్తాడు. ఇది హాట్ టాపిక్ అవుతుంది. అయితే అనంతరం ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ కొడుకుని అభినందించారు. టీజర్‌లో బాగా చేశావని, సినిమాలో కూడా బాగా చేసి ఉంటావని నమ్ముతున్నాన్నారు.
అయితే టీజర్‌లో ఆఖరి షాట్ చూసి.. అంటూ కుర్రాళ్లని ఉద్దేశించి రాజీవ్ ఏదో చెప్పబోయి ఆపేశాడు. దీంతో పక్కనే ఉన్న సుమ కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పదా`అంటూ ఆమె సిగ్గుతో తలదించుకుని రాజీవ్‌ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ జనరల్‌గా వాళ్లకి( ఆడియెన్స్ కి) అనిపించింది చెప్పాను. అవును కదా? అనగా, ఆడియెన్స్ నుంచి పెద్ద అరుపులు వచ్చాయి. దీనికి సుమ స్పందిస్తూ ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో ? ఇది టీజర్ మాత్రమే అంటూ ఆమె తల కిందకు వేసి రాజీవ్ స్పీచ్‌ని ఆపే ప్రయత్నం చేసింది.
అయితే దీనిపై నెటిజన్ల నుంచి సెటైర్లు, విమర్శలు పేలుతున్నాయి. యాంకర్ సుమ అంటే అందరిలో ఓ మంచిఅభిప్రాయం ఉంది. పాజిటివ్‌గా తీసుకుంటారు. కానీ ఆమె కొడుకు సినిమాల్లో ఇలాంటి బూతులు ఉండటం పట్ల వారి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇది చాలా ఇబ్బందిగా ఉందని, పైగా స్టేజ్‌పై రాజీవ్, సుమ అలా మాట్లాడటం కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. అయితే ఇటీవల సినిమాల్లో బూతు డైలాగులు, అమ్మాయిలను తిట్టడం, బోల్డ్ సీన్లు శృతి మించి ఉంటున్నాయి. అదే సక్సెస్ ఫార్ములా మారింది. చాలా వరకు అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు సక్సెస్ కావడం గమనార్హం. ఇటీవల వచ్చిన `మ్యాడ్`, `బేబీ`, `అర్జున్‌రెడ్డి` చిత్రాలు ఆ కోవకే చెందుతాయి.