Asianet News TeluguAsianet News Telugu

జీవితను ఒప్పించాడు... సన్నీతో చేస్తున్నాడు.. యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా

  • రాజశేఖర్ మూవీలో సన్నీలియోనీ స్పెషల్ సాంగ్
  • గరుడ వేగలో ప్రత్యేక పాట కోసం జీవితని ఒప్పించిన రాజశేఖర్
  • రాజశేఖర్ సరసన స్టెప్పులేయించనున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు
rajashekar to romance sunny leone for garuda

ఒకప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్.. ఆ తర్వాత చెత్త సినిమాలు చేసి ఫేడవుట్ అయిపోయాడు. రెండేళ్ల క్రితం గడ్డం గ్యాంగ్ తో ఫ్లాప్ నిచ్చాడు యాంగ్రీ హీరో రాజశేఖర్. ఆ సందర్భంలో డ్రీమ్‌రోల్స్‌ ఏమైనా చేయాలనుకున్నారా అని అడిగితే... ఏ మాత్రం తడుముకోకుండా డ్రీమ్ రోల్ లేదు కానీ డ్రీమ్ గర్ల్ దంటూ.. అప్పట్లోనే సన్నీ లియోనీతో చేయాలనుంది.. కానీ.. జీవిత కుదరనిస్తుందో లేదోనని నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు మొత్తానికి జీవితను ఎలాగోలా ఒప్పించి సన్నీతో చేయబోతున్నాడు రాజశేఖర్.

 

యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ’తో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తున్నాడు ఈ యాంగ్రీ యంగ్ హీరో. ఈ మధ్యే రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ బాగానే అనిపించింది. ఈ సినిమాలో ఏదో ఉందన్న ఫీలింగ్ కలిగించింది ఫస్ట్ లుక్.
 

ఇక సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడిస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సన్నీ లియోన్‌తో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయిస్తున్నాడట ప్రవీణ్. సన్నీ ఇంతకుముందే ‘కరెంటు తీగ’ సినిమాలో మంచు మనోజ్ తో ఒక పాట చేసింది. ఆ పాట సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు రాజశేఖర్ సినిమాకు సన్నీ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేయాలని ప్రవీణ్ భావిస్తున్నాడు.

 

సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios