Asianet News TeluguAsianet News Telugu

మరోసారి 'మగాడు' గా మారుతున్న రాజశేఖర్

ప్రశాంత్ వర్మతో  చేసిన కల్కి తర్వాత   బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌ చివరగా నితిన్‌ నటించిన ...

Rajashekar Pavan Sadineni titled as Magaadu jsp
Author
First Published Aug 29, 2024, 11:52 AM IST | Last Updated Aug 30, 2024, 8:03 AM IST


రాజశేఖర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం 'మగాడు'. దాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ సక్సెస్ ని సాధించింది. తొంభైలలో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటికి ఆయన అభిమానులు మాట్లాడుతూంటారు. ఇప్పుడు అదే టైటిల్ తో మరోసారి రాజశేఖర్ సినిమా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

ప్రశాంత్ వర్మతో  చేసిన కల్కి తర్వాత   బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌ చివరగా నితిన్‌ నటించిన ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా అనుకున్న స్దాయిలో ఆడలేదు. ఆ తర్వాత పూర్తి స్దాయి యాక్షన్ తో కూడిన సినిమా ఒకటి ఆయన కమిటయ్యారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.

దర్శకుడు పవన్‌ సాదినేని (Pavan Sadineni) డైరక్షన్ లో రాజశేఖర్ సీరియస్‌ యాక్షన్‌ డ్రామా ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి మగాడు  (Magaadu) టైటిల్‌ను పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది.  అయితే మేకర్స్‌ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీ దుర్గా దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో రమేష్ గంజి ఈ చిత్రాన్ని 2024 చివరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తోంది.

రాజశేఖర్, పవన్ సాధినేని సినిమాకు 'మాన్‌స్ట‌ర్‌' ఖరారు చేసినట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ టైటిల్ పరిశీలనలో ఉందని యూనిట్ సభ్యుల నుంచి సైతం వినిపించింది. కానీ, ఇప్పుడు టైటిల్ మారిందని టాక్. ఇక దర్శకుడుగా పవన్ సాధినేనికి యాక్షన్ ని బాగా డీల్ చేయగలరని పేరుంది. తొలి చిత్రం 'ప్రేమ ఇష్క్ కాదల్' తో పరిశ్రమలోకి దర్శకుడిగా ఆరంగేట్రం చేసి, మొదటి సినిమాతో ప్రసంశలు అందుకోవటమే కాకుండా, అందరి కళ్ళలో పడ్డాడు పవన్. 

ఆ తరువాత 'సావిత్రి' అనే ఇంకో సినిమా చేసాడు. కానీ ఎందుకో తరువాత వెబ్ సిరీస్ ల మీదకి వెళ్లి కొన్ని వెబ్ సిరీస్ లు చేసారు పవన్. తాజాగా 'దయా' అనే వెబ్ సిరీస్ చేసి అందులోకూడా తన ప్రతిభని చాటుకున్నాడు. జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో తయారైన ఈ 'దయా' వెబ్ సిరీస్ మంచి పేరు సంపాదించి పెట్టింది పవన్ కి.అలాగే త్వరలో పవన్ సాధినేని మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార టైటిల్ తో  ఓ  సినిమా చేస్తున్నట్టుగా తెలిసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios