గరుడ వేగ సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు కల్కి సినిమా ద్వారా ఫుల్ ఫార్మ్ లోకి రావాలని అడుగులువేస్తున్నాడు. ఇప్పటికే టీజర్ పోస్టర్స్ తో సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన కల్కి యూనిట్ ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. 

రాజశేఖర్ సినిమాలో మంచి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. అయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఎండింగ్ లో తన డ్యాన్స్ పై ధీటుగా సమాధానం చెప్పి యాక్షన్ సీన్ తో అదరగొట్టేశాడు. ఖర్మ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ గట్టిగా వాడినట్లు తెలుస్తోంది. ఇక కల్కిలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. 

అలాగే పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అ! సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.