సీనియర్ నటుడు రాజశేఖర్ కల్కి షూటింగ్ లో ఒక యాక్సిడెంట్ కి గురైనట్టు మొన్నటివరకు అనేక కథనాలు వెలువడ్డాయి. యాక్షన్ సన్నివేశాల్లో డుబ్ లేకుండా నటించాలని ట్రై చేసి గాయానికి గురైనట్లు వివిధ రకాల వార్తలు వచ్చాయి. అలాగే రాజశేఖర్ గాయపడినట్లు కొన్ని ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. 

అయితే వాటన్నిటిపై రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ లో గాయపడ్డది నిజమేనని అయితే తాను గాయపడినట్లు వచ్చిన కొన్ని ఫొటోలు నిజం కాదని తెలిపారు. ఇక గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు వచ్చిన న్యూస్ లలో కూడా నిజం కాదని చెప్పారు. తాను త్వరగానే కోలుకున్నట్లు చెబుతూ ప్రస్తుతం కులు మనాలి లో జరుగుతున్న షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు చెప్పారు. 

కల్కి సినిమాకు అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజశేఖర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. తమిళ నటులు కూడా సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శివాని శివాత్మిక ప్రొడక్షన్ లో సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.