యాంగ్రీ హీరో రాజశేఖర్ చాలా రోజుల తర్వాత గరుడవేగ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ కాస్త జోరు పెంచారు. ఇటీవల విడుదలైన కల్కి చిత్రం పర్వాలేదనిపించింది. తాజాగా రాజశేఖర్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

మరో థ్రిల్లర్ కథకు రాజశేఖర్ ఒకే చెప్పారు. బేతాళుడు చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన చెప్పిన ఎమోషనల్ థ్రిల్లర్ కథ ఆసక్తికరంగా ఉండడంతో రాజశేఖర్ ఈ చిత్రానికి వెంటనే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 

నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలని త్వరలో ప్రకటించనున్నారు. ఓ నవల ఆధారంగా ఈ చిత్ర కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.