గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ కాస్తంత ఒడ్డున పడ్డాడు. వరస ప్లాఫ్ ల నుంచి... గరుడవేగ రిలీఫ్ ఇచ్చింది. ఈ  చిత్రానికి ముందు రాజశేఖర్ తో ప్రారంభించిన కొన్ని  సినిమా ఆగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమా ఒకటి ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎనిమిది సంవత్సరాల క్రితం రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన 'అర్జున' చిత్రం మాత్రం షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు కల్కితో క్రేజ్ తెచ్చుకుంటున్న రాజశేఖర్ ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడుతుందో కానీ నిర్మాతకు మాత్రం ఇంక రిలీజ్ కాదు అనుకున్న సినిమా రిలీజ్ అవటం ఆనందం కలిగిస్తోంది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం విడుదల విషయంలో రాజశేఖర్ ఇంట్రస్ట్ గా  లేడని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం పరిస్దితులకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అప్పటి సినిమా ఈ డిజిటల్ యుగంలో ఏ మాత్రం వర్కవుట్ అవుతుందనే అనుమానంతో ఉన్నాడట. కానీ రిలీజ్ కావటం..కాకపోవటం అనేవి ఆయన చేతిలో లేని విషయాలుకాబట్టి సైలెంట్ గా ఉన్నారట. 

అయితే  నిర్మాతలు పట్టువదలకుండా సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయటం లేదు కానీ ,  వంద లోపు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల అయితే రాజశేఖర్ - వర్మల కాంబోలో రూపొంది ఆగిపోయిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. 

కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.