నిన్న రాత్రి ఆమె వెళ్లిపోయిందని ఎవరో రూమర్ క్రియేట్ చేసారు. ఈ విషయం వాళ్ల దాకా దాకా చేరింది. రాజశేఖర్ కు ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీ. వీళ్లిద్దరూ తెలుగు,తమిళంలో నటిస్తున్నారు.
రాజశేఖర్ కుమార్తె తన బోయ్ ప్రెండ్ తో లేచిపోయిందంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. గత రెండు రోజులుగా మీడియాలో ఈ విషయమై వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి ఆమె వెళ్లిపోయిందని ఎవరో రూమర్ క్రియేట్ చేసారు. ఈ విషయం వాళ్ల దాకా దాకా చేరింది. రాజశేఖర్ కు ఇద్దరు కుమార్తెలు శివాత్మిక, శివానీ. వీళ్లిద్దరూ తెలుగు,తమిళంలో నటిస్తున్నారు.
ఇక ఈ రూమర్ చూసిన శివాని రాజశేఖర్ తన ఇనిస్ట్రాలో ఖండించారు. తాము ప్రస్తుతం దుబాయిలో తన ఫ్యామిలీతో ఉన్నామని ఆ ఫొటో షేర్ చేసింది. అంతేకాదు రాజశేఖర్ కు ఇద్దరు కుమార్తెలు కాబట్టి ఏ కుమార్తె లేచిపోయిందనే విషయం గాసిప్ రాయుళ్లు క్లారిటీ ఇవ్వాలని అంది.
ప్రస్తుతం శివానీ...అల్లరి నరేష్ హిట్ మూవీ అహనా పెళ్లంట టైటిల్‌తో వస్తోన్న ఓ వెబ్ సీరిస్ చేస్తోంది. ఈ సీరిస్ కు సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ సరసన రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి ఆమనితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాజమండ్రిలో ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఎపిసోడ్ 30 నిమిషాల చొప్పున.. మొత్తం 8 ఎపిసోడ్ల పాటు ఈ వెబ్ సీరిస్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ వెబ్ సీరిస్ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు వచ్చి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు ఓ యువకుడు ( రాజ్ తరుణ్). ఎట్టకేలకు ఓ అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పీటలు కూడా ఎక్కుతాడు.
కరెక్టుగా తాళి కట్టే టైంలో రాజ్ తరుణ్ కలలపై నీళ్లు జల్లి పెళ్లి కూతురు ( శివాని) తన భాయ్ ఫ్రెండ్‌తో కలిసి లేచిపోతుంది. దీంతో రాజ్ తరుణ్ తీవ్ర మనోవేదకు గురైపోతాడు. శివానితో పాటు ఆమె భాయ్ ఫ్రెండ్‌పై పగతో రగిలిపోతాడు.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఎలాంటి ? పరిణామాలు ఎదుర్కొన్నాడు ? కథలో ఏం జరిగింది అన్నదే ఈ వెబ్ సీరిస్.
ప్రేమలోని కొత్త కోణాన్ని ఈ వెబ్ సీరిస్ ఆవిష్కరించబోతోందట. సరికొత్త ప్రేమకు నిర్వచనంగా ఈ సీరిస్ ఉంటూ అందరిని అలరిస్తుందని మేకర్స్ ధీమాతో ఉన్నారు. కామెడీతో పాటు రొమాన్స్ డ్రామాతో ఈ వెబ్ సీరిస్ ఉంటుందని, రాజ్ తరుణ్ – శివానీ మధ్య అదిరిపోయే సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ వెబ్ సీరిస్‌తో ఓటీటీలో అయినా శివానీ క్లిక్ అవుతుందేమో ? చూడాలి.
