సూపర్ స్టార్ సినిమా చూడటానికి సూపర్ స్టార్ వస్తున్నారు

Rajanikanth to watch bharath ane nenu
Highlights

సూపర్ స్టార్ సినిమా చూడటానికి సూపర్ స్టార్ వస్తున్నారు

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.వంద కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చూడాలనుకుంటున్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీఎంగా మహేష్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచింపచేసేవిగా ఉండటంతో పాటు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిభింబించేవిగా ఉండటంతో రజనీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. త్వరలో పొలిటికల్‌ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రజనీ.. భరత్‌ అనే నేను సినిమా చూడాలనుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాను తమిళ్‌ లో రీమేక్‌ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

loader