మీకు తెలుసా..సినిమాల్లోకి రాకముందు నుంచీ రజనీకాంత్ ..మన అన్నగారు ..తెలుగు ప్రజల ఆరాధ్య దైవం గా కొనియాడబడ్డ..నందమూరి తారకరామారావు గారి అభిమాని. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. సౌతిండియాలో సూపర్ స్టార్ గా వెలిగే రజనీ ..ఇలా ఓ తెలుగు నటుడు పేరు చెప్పటంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అంతేలేదు.  రీసెంట్ గా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు రజనీకాంత్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్దావించారు. 

ఆ పత్రికవారు... కండక్టర్‌ నుంచి నటనలోకి ఎలా రావాలనుకున్నారు? ప్రేరణ ఏమిటి అని అడిగారు. దానికి రజనీ స్పందిస్తూ..  కర్ణాటకలో బస్‌ కండక్టర్‌గా పని చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం యానివర్శరీ సెలబ్రేషన్స్‌కు ఏదో ఓ నాటకం వేయాలి. నేను దుర్యోధనుడి పాత్ర చేయాలనుకున్నాను. నేను ఎన్టీ రామారావుగారి అభిమానిని. ఆయన్ను బాగా ఇమిటేట్‌ చేసేవాణ్ణి. అప్పుడు నా స్నేహితుడు ప్రోత్సహించాడు. మా అన్నయ్య కూడా ఎంకరేజ్‌ చేయడంతో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ బాలచందర్‌గారు పరిచయం అయ్యారు. తర్వాత మీకు తెలిసిందే అని వివరించారు. 

 ఇక నటుడుగా మీ రోల్‌ మోడల్‌ ఎవరు అని అడిగితే.. శివాజీ గణేశన్‌ గారు. ఆయన్ను బాగా ఇమిటేట్‌ చేసేవాణ్ణి. ‘ఆల్రెడీ శివాజీ గణేశన్‌గారు ఉన్నప్పుడు మళ్లీ ఇమిటేట్‌ చేయడం దేనికి?’ అని బాలచందర్‌గారు నాతో అన్నారు. నాలో స్పీడ్‌ని గమనించారు ఆయన. ‘ఇది నీ ఒరిజినాలిటీ. నీ స్టైల్, నీ ట్రేడ్‌మార్క్‌’ అన్నారు. అలా నాకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ ఏర్పరచుకున్నాను అని చెప్పారు. 

ఇక రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్‌ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ఆర్‌. సినిమా సంస్థ విడుదల చేసింది. అన్ని చోట్ల నుంచి మంచి హిట్ టాక్  నడుస్తోంది.