Asianet News TeluguAsianet News Telugu

#LalSalaam: రజనీ ‘లాల్‌ సలాం’ఎంత పెద్ద డిజాస్టర్ అంటే..నైజాంలో అంత తక్కువ

తమిళంలో ఈ సినిమాపై బజ్ భారీగానే ఉన్నా అక్కడా డిజాస్టర్ అయ్యింది.  తెలుగులోనూ మొదటి రోజే  రెస్పాన్స్ లేదు.   తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ మూవీ మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. 
 

Rajanikanth #LalSalaam Biggest Disaster of 5 Decades Career! JSP
Author
First Published Feb 15, 2024, 6:45 AM IST | Last Updated Feb 15, 2024, 6:45 AM IST


సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అయితే ఆయన జైలర్ కు ముందు దాకా వరస డిజాస్టర్స్ తో ఇబ్బందిపడ్డారు. కానీ మార్కెట్ ని కోల్పోలేదు. జైలర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. ఈ క్రమంలో ఆయన  ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్ మరియు జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.

 ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విడుదలకి ముందు భారీ బజ్ క్రియేట్ చేసుకున్న లాల్ సలామ్ సినిమా భారీ ఎక్సపెక్టేషన్స్ తో శుక్రవారం (ఫిబ్రవరి 9) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో ఈ సినిమాపై బజ్ భారీగానే ఉన్నా అక్కడా డిజాస్టర్ అయ్యింది.  తెలుగులోనూ మొదటి రోజే  రెస్పాన్స్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ మూవీ మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. 

లాల్ సలామ్ సినిమాకు రజనీ కెరీర్‌లోనే ఊహించని విధంగా దారుణమైన కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్‌కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో వీకెండ్ షేర్ ₹11L . యాభై ఏళ్ల  రజనీ కెరిర్ లో ఈ సినిమా  అతి పెద్ద డిజాస్టర్ గా ట్రేడ్ చెప్తోంది.ఆంధ్రా,తెలంగాణా కలిపి  ₹50L షేర్ కూడా తెచ్చుకోలేకపోయాయి.

ఈ క్రమంలో  లాల్ సలామ్ మూవీని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు.మరో ప్రక్క లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. లాల్ సలామ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకు లాల్ సలామ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయిన 60 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది..కానీ ఇప్పుడు ఎగ్రిమెంట్ మార్చి నెలలోపలే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళ మీడియా అంటోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios