ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ పెరగటమే కానీ ఏ మాత్రం తగ్గడంలేదు. రిలీజ్ రోజు నుండే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్ (Jailer) భాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. ఈ సిని ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఫైనల్ కలెక్షన్స్ ఎంత వస్తాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ పెరగటమే కానీ ఏ మాత్రం తగ్గడంలేదు. రిలీజ్ రోజు నుండే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు.ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఓ రేంజి కలెక్షన్స్ ఉన్నాయి. రోజు వారి కలెక్షన్స్ చూద్దాం.
రోజు 1 - 3.21CR
రోజు 2 - 1.18CR
రోజు 3 - 1.95CR
రోజు 4 - 2.32CR
రోజు 5 - 1.72CR
రోజు 6 - 2.88CR
రోజు 7 - 1.27CR
రోజు 8 - 90L
రోజు 9 - 75L
రోజు 10 - 1.39CR
రోజు 11 - 1.67CR
రోజు 12 - 46L
రోజు 13 - 31L
ఇప్పటిదాకా మొత్తం కలెక్షన్స్ - 20.01CR షేర్
ఈ చిత్రానికి నైజాం ఏరియాలో అయ్యిన బిజినెస్ - 4.50CR(Valued)
అంటే ఇప్పటికి 15.51CR లాభం వచ్చింది.
నిజానికి తెలుగులో ఈ సినిమాపై మొదట ఎక్సపెక్టేషన్స్ లేవు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా లేవు. అయితే ట్రైలర్ క్లిక్ అవటంతో ఓపినింగ్స్ బాగా వచ్చాయి. ఆ తర్వాత సినిమా కలెక్షన్స్ కుమ్మటం మొదలైంది. కొనుక్కున్న వాళ్లకు పండగ చేసుకునేలా చేసింది.
'రోబో 2.0' సినిమా తరువాత రజనీ కొట్టిన పెద్ద హిట్ జైలర్. రోబో కు జైలర్ కు మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ప్రతీసారి రజనీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే అదిరిపోతుందని ఎక్సపెక్టేషన్స్ పెరగటం ఆతర్వాత తుస్సుమనటం కామన్ అయ్యిపోయింది. ఆ మధ్య ఆయన చేసిన 'పెద్దన్న' సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా తమిళనాట కూడా తన సత్తా చూపలేకపోయింది. ఇక తెలుగులో కూడా వసూళ్ల పరంగా ఆ సినిమా డీలాపడిపోయింది.
ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే 'జైలర్'. అయితే జైలర్ ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. రిలీజ్ రోజునే ఈ సినిమా తన స్థాయిని చాటుకుంది. రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ కు సరైన కథ పడటం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. తన కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకునే రిటైర్డ్ జైలర్‌గా రజనీకాంత్ యాక్టింగ్, మేనరిజమ్స్‌తో పాటు ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చన జైలర్ సినిమాలో..తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు.
