యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న   చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ కోసం అభిమానులే కాక సినిమావాళ్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఏవో చిన్న చిన్న లీక్ లు అయితే సినిమా గురించి బయిటకు వస్తున్నాయి కానీ సినిమా గురించి అఫీషియల్ గా మాత్రం న్యూస్ లు రావటం లేదు. చాలా సీక్రెట్ గా ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న నేపధ్యంలో అభిమానులకు ఈ సినిమా గురించి కొన్ని క్లూలు రాజమౌళి ఇవ్వదలిచారని సమాచారం. 

ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో కోల్ కాతాలో జరగబోయే షెడ్యూల్ కోసం బయల్దేరనుంది. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షెడ్యూల్ ముగిశాక ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను పెట్టనున్నారు.   ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో ఏ విషయాలను రివీల్ చేస్తారో అని మీడియా మొత్తం ఎదురుచూస్తోంది.

ఇక ఈ  నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రంలోని చరణ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ వర్కింట్ టైటిల్ తోనే.. చెర్రీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట చిత్ర యూనిట్.

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో.. అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.