బాహుబలి2 తర్వాత రాజమౌౌళి ఏం చేయబోతున్నాడు రిలీజ్ డేట్ పై మళ్లీ డౌట్స్ క్రియేట్ చేసిన జక్కన్న గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట, ఫినిష్ అయితేనే అనుకున్న డేట్ కు రిలీజట
బాహుబలి 2 రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి శివరాత్రి సందర్భంగా ఇచ్చిన యాంకర్ సుమ ఇంటర్వ్యూలో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. ప్రస్థుతం సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ వేగంగా జరుగుతోందని తెలిపాడు. అయితే ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అప్పటివరకు రెడీ అవుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు రాజమౌళి. స్వయంగా రాజమౌళి చెప్పడంతో మరోసారి బాహుబలి రిలీజ్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇప్పటికే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియక జుట్టు పీక్కుంటున్న అనేక మందికి ఇప్పుడు రిలీజ్ డేట్ పై జక్కన్న చేతులెత్తేయడంతో మరింత యాంగ్జయిటీ పెరిగిపోతోంది.
అంతే కాదు.. ఇప్పటికే గత కొన్నేళ్లుగా హైప్ క్రియేట్ చేస్తూ ఇప్పటికే వందల కోట్ల బిజినెస్ చేసిననవ బాహుబలి2 చిత్రంతో బాహుబలి తొలి సిరీస్ పూర్తి చేస్తానని బాహుబలి దర్శకుడు చెప్తున్నాడు. ఈ లెగసీని ఇలాగే కంటిన్యూ చేసేందుకు బాహుబలి అనుబంధంగా గేమ్స్, నావెల్స్ ఇలా వస్తుునే ఉన్నాయి. అయితేేే బాహుబలి2 రిలీజ్ తర్వాత రాజమౌళి ప్లానింగ్స్ ఏంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే.
బాహుబలి2 కోసం గత నాలుగేళ్లుగా శ్రమించిన టీమ్ లో ఇప్పటికే ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. రానా కూడా ఘాజీ హాట్ కొట్టి మరి కొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఇక అనుష్క కూడా భాగమతి తదితర చిత్రాల్లో నటిస్తోంది. తమన్నా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. అయితే బాహుబలిపైనే పూర్తి గా దృష్టి పెట్టిన రాజమౌళి ఈ సినిమా అయిపోగానే ఏంచేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్న పరిస్థితి.
కానీ రాజమౌళి బాహుబలి 2 అయిపోగానే పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోతాడట. అంతా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న మహాభారతంపై దృష్టి పెడతాడని, దాన్ని సూపర్ స్టార్లందరితో కలిసి వెయ్యి కోట్లతో నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ తాను అలాంటివేం ఇంకా ప్లాన్ చేయలేదని స్వయంగా రాజమౌళి చెప్తున్నాడు. పైగా బాహుబలి 2 అయిపోగానే పెట్టే బేడా సర్దుకుని కొన్నాళ్ల పాటు వెకేషన్ పై వెళ్తానని డిక్లేర్ చేశాడు. వెకేషన్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకుని వచ్చాక గానీ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. అప్పటిదాకా ఎలాంటి ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేయలేదని స్పష్టం చేశాడు రాజమౌళి.
