రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగా రానిస్తాడంటున్న జక్కన్న పవన్ అంటే నిజాయితతీ, క్రేజ్ గుర్తొస్తుందన్న రాజమౌళి ఓ టీవీ కార్యక్రమంలో తన అభిపప్రాయాలు వెల్లడించిన దర్శక ధీరుడు

బాహుబలి చిత్రంలో తెలుగు సినిమాకే ఓ స్టేటస్ తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి ఏంచేసినా, ఏం మాట్లాడినా పెద్ద విషయమే. అలాంటి రాజమౌళి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని అనేక ప్రశ్నలకి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బాహుబలి నిర్మాత శోభుతో కలిసి పాల్గొన్న రాజమౌళి.. బాహుబలి సెట్ లో తనని అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరు అంటే రమ్యకృష్ణ అని చెప్పుకొచ్చారు.

రానా వ్యాఖ్యాత గా వ్యవహరించిన నెంబర్ వన్ యారి ప్రోగ్రాం లో రమ్యకృష్ణ కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టిన పేర్లలో ప్రభాస్,అనుష్కల పేర్లు ఇస్తే రానా పేరు లేదా అని అడిగాడు మౌళి. ఈ సందర్భంగా రానా తెలుగు టాప్ హీరోలు ఇతర వృత్తులు ఏవి చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు అని అడగినప్పుడు... ఆయన ఛాయిస్ ప్రకారం ప్రభాస్ చెఫ్ గా చెబితే.. చరణ్ ను బిజినెస్ మ్యాన్ గా చెప్పారు.

ఇక.. తారక్ కు పాలిటిక్స్ అయితే బాగా సూటవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరు వినగానే నిజాయతీ , విశ్వాసం , క్రేజ్ గుర్తుకు వస్తాయని, మహేష్ అనే పేరు వినగానే అందం తప్ప ఇంకేమీ గుర్తు రాదు అని చెప్పుకొచ్చాడు జక్కన్న. టాలీవుడ్ లో తనకి ఫేవరేట్ డైరెక్టర్ అంటే సుకుమార్ అని తడుముకోకుండా చెప్పేసాడు మౌళి. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో రానిస్తారన్న అభిప్రాయం రాజమౌళికే కాక చాలా మంది ప్రజలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.అన్న ఎన్టీఆర్ కు అసలు వారసుడు నందమూరి తారక్ అని అభిప్రాయం కూడా బలపడుతోంది. అయితే... ఇప్పుడే సమయం రాలేదని జూనియర్ ఎన్టీఆర్ కొట్టిపారేస్తున్నారు.