Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli:రాజమౌళికి సినిమా చూపించి, మార్పులు, కలిసొస్తుందా?

 సినిమా చూసి రాజమౌళి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు కూడా సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఇది సర్వైవల్ థ్రిల్లర్‌ హాలీవుడ్ లో విరివిగా వస్తుంటాయి. 

Rajamouli Suggested changes for Dongalunnaru jagratha movie
Author
First Published Sep 22, 2022, 12:34 PM IST


ఒకప్పుడు తెలుగులో  రాజమౌళికు క్రేజ్ ఉండేది. ఇప్పుడు దేశమంతటా పాకింది. దాంతో రాజమౌళి సినిమా చూసి మార్పులు, చేర్పులు చేసారంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే కొందరు నమ్ముతారు. బిజినెస్ పరంగానూ క్రేజ్ ఉంటుంది.  దాంతో ఆయన్ను సంప్రదస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా బ్రహ్మాస్త్రకు ఆయన చేసిన పబ్లిసిటీ బాగా ఉపకరించింది. ఇప్పుడు ఆయన అన్న కీరవాణి కుమారుడు నటించిన చిత్రానికి సైతం ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీసింహ స్వయంగా తెలియచేసారు.  

డి. సురేష్‌ బాబు సురేష్‌ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్‌ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్‌ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో శ్రీ సింహ మీడియా సమావేశంలో ఈ సినిమా విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్బంగా రాజమౌళి ప్రస్తావన వచ్చింది.

శ్రీ సింహ మాట్లాడుతూ.....ఈ సినిమా గురించి మొదట ఇంట్లో ఏమీ చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ షో వేశాం. సినిమా చూసి రాజమౌళి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు కూడా సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఇది సర్వైవల్ థ్రిల్లర్‌ హాలీవుడ్ లో విరివిగా వస్తుంటాయి. ఈ జోనర్ ని ఇక్కడ ఎవరు ఒకరు మొదలుపెట్టాలి. మేము స్టార్ట్ చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చాడు సింహ.

అలాగే 'దొంగలున్నారు జాగ్రత్త' చాలా యూనిక్‌ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో పాటు డిఫరెంట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ కూడా వుంది.  కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. చాలా ఎమోషన్స్‌ కనెక్ట్‌ అయి వుంటాయి. ప్రతి ఒక్కరూ  ఆ పాత్రకు కనెక్ట్‌ అవ్వగలుగుతారు.ఎందుకంటే ఇందులో మిడిల్‌ క్లాస్‌ కుటుంబంలో జరిగే నేచురల్‌ విజువల్స్‌ వుంటాయి. .ఇందులో దొంగగా కనిపిస్తా, ఒక దొంగగా వచ్చిన వ్యక్తి చివరికి ఎలా మారాడు, తన తప్పులని ఎలా తెలుసుకున్నాడనేది సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ఐతే మంచి దొంగలా చూపించడం మాత్రం ఇందులో వుండదు. చాలా సహజంగా దొంగని దొంగనే చూపించాం. దొంగని చూస్తే చిరాకు వస్తుంది. అదే సమయంలో అతను తప్పు తెలుసుకున్నపుడు జాలి కూడా కలుగుతుంది. సింగల్ లొకేషన్‌లో.. 72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు.

సినిమా కథాంశానికి వస్తే..  ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని (Preethi Asrani) కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని (Samuthirakani) ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ (Kaala Bhairava) సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios