Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబుకు రాజమౌళి కండిషన్స్... చాలా కష్టం గురూ!

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది మహేష్ బాబు-రాజమౌళి చిత్రం. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. కాగా రాజమౌళి అప్పుడే మహేష్ కి కొన్ని సూచనలు చేశాడట. 
 

rajamouli sets some conditions to mahesh babu ksr
Author
First Published Jan 19, 2024, 5:24 PM IST | Last Updated Jan 19, 2024, 5:29 PM IST

స్టార్ హీరోలను కూడా శాసించే ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అయితే రాజమౌళితో మూవీ అంటే ఆషామాషీ కాదు. కనీసం మూడు నాలుగేళ్లు సమయం కేటాయించాలి. మరో మూవీకి కమిట్ కావడానికి వీల్లేదు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మార్చుకోవాలి. బాహుబలిలో ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్, రానా, ఆర్ ఆర్ ఆర్ లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలానే చేశారు. 

రాజమౌళి నెక్స్ట్ హీరో మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. మొదటిసారి వీరి కాంబోలో మూవీ రానుంది. ఈ క్రమంలో మహేష్ బాబుకు కూడా రాజమౌళి కొన్ని సూచనలు చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. మార్చి నుండే మహేష్ బాబు బయట కనిపించకూడదట. యాడ్ షూట్స్ లో పాల్గొనకూడదట. విహారాలకు వెళ్లకూడదట. 

మహేష్ బాబు లుక్ ఏవిధంగానూ బయటకు రాకూడదనేది రాజమౌళి ఆలోచనట. నెల రోజుల పాటు లుక్ టెస్ట్ జరగనుందట. రాజమౌళి హీరో గెటప్ పై కొన్ని స్కెచ్ లు వేయించాడట. వాటి ఆధారంగా లుక్ టెస్ట్ జరుగుతుందట. ఫైనల్ అయిన లుక్ కి తగ్గట్లు మహేష్ బాబు మేకోవర్ కావాల్సి ఉందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కనుంది. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios