Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీపై రాజమౌళి సంచలన స్టేట్‌మెంట్‌.. జక్కన్న కామెంట్స్ పై వర్మ ఫన్నీ రియాక్షన్‌..

దర్శకుడిగా rgv సృష్టించిన సంచలనాలను మాత్రం మేకర్స్ మర్చిపోవడం లేదు. ఆ విషయంలో వర్మకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి.. వర్మని ఉద్దేశించిన చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం. 

rajamouli sensational statement on rgv he react like funny post viral arj
Author
First Published Nov 28, 2023, 12:21 PM IST

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. దర్శకుడిగా ప్రారంభంలో సంచలన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన `శివ` సినిమాతో సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి. సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించారు. అదే సమయంలో ఎవరికీ సాధ్యం కాని స్టయిల్‌ని చూపించాడు. సినిమాని ఇలా కూడా తీస్తారా? అనే ఆశ్చర్యపోయేలా, ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ మొత్తం నోరెళ్లబెట్టేలా చేశారు. `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్‌`, `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు. 

కానీ ఆ తర్వాత వర్మ క్రేజ్‌ తగ్గిపోయింది. ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. వర్మ సినిమాలు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం లేదు. అదేసమయంలో తన మేకింగ్‌లో క్వాలిటీ తగ్గిపోయింది. వర్మ భాషలో చెప్పాలంటే ఆయనలో జూస్‌ అయిపోయిందనేలా ఇప్పుడు తను తీసే సినిమాలుంటున్నాయి. తను కూడా సినిమాలను లైట్‌ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమాల కంటే వర్మ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్ట్ లు, క్రేజీ కామెంట్లతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. అందరిని విమర్శిస్తూ హైలైట్‌ అవుతున్నారు. 

బట్‌.. ఒక దర్శకుడిగా ఆయన సృష్టించిన సంచలనాలను మాత్రం మేకర్స్ మర్చిపోవడం లేదు. ఆ విషయంలో వర్మకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి.. వర్మని ఉద్దేశించిన చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం. ఆయన `యానిమల్‌` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఇందులో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా గురించి చెబుతూ, తెలుగు సినిమా పరిశ్రమలో బ్లాక్‌ బస్టర్స్, హిట్లు, సూపర్‌ హిట్లు తీసిన దర్శకులు వచ్చారు. వండర్స్ చేశారు. కానీ సినిమా ఫార్ములాని బ్రేక్‌ చేసి, ఆడియెన్స్ ని షేక్‌ చేసిన దర్శకులు కొందరే ఉంటారు. ఒకప్పుడు నా తరంలో రామ్‌గోపాల్‌ వర్మని చూశాను. ఆయన సినిమా ఇలా తీయాలనే రూల్స్ ని బ్రేక్‌ చేసి షాకిచ్చారు. ఇప్పుడు మళ్లీ సందీప్‌ రెడ్డి వంగాని అలా చూస్తున్నా. `యానిమల్‌` సినిమాని అలా మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా తీశారు అని చెప్పారు రాజమౌళి. 

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై తాజాగా వర్మ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఓ ఫన్నీగా పోస్ట్ పెట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ గురించి ఇలాంటి వ్యాఖ్యలను తాను ఎప్పుడూ వినలేదంటూ షాకింగ్‌ ఎమోజీని పంచుకున్నారు వర్మ. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్‌ అవుతుంది. దీన్ని కూడా వర్మ సరదాగానే తీసుకున్నట్టు అనిపిస్తుంది. 

Read more: Animal ఈవెంట్‌లో రష్మికకి మహేష్‌ హగ్‌పై పేలుతున్న సెటైర్లు.. ఇంటికెళ్లాక నమ్రతతో ఉంటుంది చూడూ.. ఇదెక్కడి గోల

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios