Asianet News TeluguAsianet News Telugu

'ఆర్ ఆర్ ఆర్' స్పెషల్ ప్రీమియర్ ఆల్రెడీ వేసారట


అల్లూరిగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  

Rajamouli Screened A Special Premiere Of RRR?
Author
Hyderabad, First Published Nov 11, 2021, 6:36 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలకు ముస్తాబవుతువున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వేగంగా అప్ డేట్ లను వదులుతున్నారు.ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేసారని తెలుస్తోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలకు ప్రత్యేకంగా ఈ స్పెషల్ షో వేసారని సమాచారం. రెండు కుటుంబాల వాళ్లు ఈ సినిమా చూసి ఆశ్చర్య పోయారని, పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వెల్లబుచ్చారట. ఇక చిరంజీవి అయితే స్పెల్ బౌండ్ అయ్యి,రాజమౌళిని ప్రశంశంలతో ముంచెత్తారని, అలాగే ఎన్టీఆర్ డాన్స్ లు చూసి మెచ్చుకున్నారని అంటున్నారు. తాము వరల్డ్ వైడ్ గా బాహుబలి తరహాలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యిపోయామని చెప్పారట. 

కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'నాటు .. నాటు' అనే పాటను వదిలారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట, రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.   అలాగే ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నెల 18వ తేదీన మూడవ సాంగ్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండటంతో రాజమౌళి క్రేజ్ ని పెంచటానికి తన దగ్గర ఉన్న ఆయుధాలను వదులుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios