దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయకి ఇటీవల తను ప్రేమించిన పూజా ప్రసాద్ తో నిశ్చితార్ధం జరిగింది. పూజా ప్రసాద్ ఎవరో కాదు.. నటుడు జగపతి బాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె..

సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్ లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట డిసంబర్ 30న పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. వీరి వివాహ వేదికకు ఒక ప్యాలస్ ని కన్ఫర్మ్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు దూరంగా రాజస్తాన్ క్యాపిటల్ జైపూర్ లో వీరి వివాహం జరగనుంది. సెవెన్ స్టార్ హోటల్ ఫెయిర్ మాంట్ వీరి వివాహానికి వేదిక కానుంది. 250 ఎకరాల్లో ముఘల్ స్టైల్ లో ఈ హోటల్ ఉంటుంది.

కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఈ ప్యాలస్ కనిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి తన కొడుకు కోసం భారీ ప్యాలస్ ని బుక్ చేసేశాడు. ఈ వేడుకకు రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా హాజరు కానున్నాయి. బాహుబలి టీమ్ తో పాటు 'RRR' సినిమా బృందం కూడా ఈ వేడుకలో పాల్గోనుంది. 

రాజమౌళి ఇంట పెళ్లి సందడి.. ముహూర్తం ఎప్పుడంటే?