జపాన్ లో దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. గతం తాలూకు రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ అదే ఊపును కొనసాగిస్తోంది జక్కన్న సినిమా.
టాలీవుడ్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అద్బుతం సృష్టించిన జక్కన్న రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్యకావ్యం ఆర్‌ఆర్‌ఆర్. సంక్షోభం తరువాత తరువాత వాయిదాల మీద వాయిదాలతో ఇబ్బందిపడి ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25న రిలీజైన ఆర్ఆర్ఆర్ వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతే కాదు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
రిలీజ్ అయ్యి ఇంత కాలం అవుతున్నా.. ఇప్పటికీ రికార్డ్ ల వేట కొనసాగిస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమా. ఈసినిమా ఒక్క తెలుగులోనే కాకుండా రిలీజైన ప్రతి భాషలోనూ డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచి.. కలెక్షల్ల వార్షం కురిపించింది సినిమా . ఇక ఈ సినిమాను రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ చేశారు టీమ్. అక్కడ కూడా అదే ప్రభంజనంను కంటీన్యూ చేస్తోంది సినిమా.
రీసెంట్ జపాన్‌లో రిలీజ్ అయ్యింది ఆర్ఆర్ఆర్. రిలీజ్ అవ్వడానికి వారం రోజుల ముందే.. రాజమౌళితో పాటు హీరోలు ఇద్దరు జపాన్ వెళ్లి గ్రాండ్ గా ట్రిపుల్ ఆర్ ను ప్రమోట్ చేశారు. దాంతో అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే 75M Yen అంటే దాదాపు 4 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది సినిమా. అంతే కాదు ఇప్పటి వరకూ 304M YEN అంటే దాదాపు 17కోట్లకు పైగా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దీంతో జపాన్ లో బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ కూడా బ్రేక్ అయ్యింది.
జపాన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించింది ఆర్ఆర్ఆర్ మూవీ. అంతేకాకుండా జపాన్‌లో ఈ సినిమాను 2లక్షలకు పైగా ఆడియన్స్ చూసినట్టు తెలుస్తోంది. బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసిన ఈ మూవీ సూపర్ స్టార్ రజనీ కాంత్ ముత్తు పేరిట ఉన్న రికార్డ్ ను కూడా క్రాస్ చేయడానికిరెడీగా ఉంది. మరో రూ.9 కోట్లు సాధిస్తే ముత్తు రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడున్న ఆర్‌ఆర్‌ఆర్ స్పీడ్ చూస్తుంటే మరో వారం పది రోజుల్లో ముత్తు రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి మన తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతోంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ట్రిపుల్ ఆర్ మన దేశంలో 1200 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈమూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించి మెప్పించారు. అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రీయా, సముద్రఖని కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా వరుస రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ.. జపాన్ లో కూడా సత్తా చాటింది.
