శ్రీవిష్ణు హీరోగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `గాలి సంపత్‌`. దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో అనిశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎస్‌.కృష్ణ నిర్మిస్తున్నారు. లవ్లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్ర ట్రైలర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ట్రైలర్‌లోని రాజేంద్రప్రసాద్‌ `ఫా `లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. అదే ఫా లాంగ్వేజ్‌తో `ఫా ఫా ఫా.. ఫన్‌ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌` అంటూ ట్రైలర్‌ని విడుదల చేశారు రాజమౌళి. ఆద్యంతం కామెడీగా సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. చివరి తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌, వారి బాండింగ్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. `ప్రపంచంలో ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు. నువ్వేంటి నాన్న నన్ను తొక్కి నువ్వు ఎదగాలని చూస్తున్నావ్‌` అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.