చిన్న సినిమాలకు గుర్తింపు రావాలంటే ప్రముఖ సినీ నటులు గాని దర్శకులు గాని ఎవరో ఒకరు సినిమాకు సంబందించిన ప్రమోషన్ లో ఓ చెయ్యి వేయాల్సిందే. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ నటించిన సర్వం తళమాయం అనే మ్యూజికల్ సినిమాకు రాజమౌళి తనవంతు సపోర్ట్ అందించాడు. 

రెహమాన్ మేనల్లుడు జివి.ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా 17 ఏళ్లకే తానేంటో నిరూపించుకున్నాడు, సౌత్ లో చాలా స్పీడ్ గా 50కి పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసి మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. ఇకపోతే హీరోగా కూడా కూడా ప్రకాష్ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు సర్వం తాళమాయం అనే సినిమాతో రానున్నాడు,. ఆ సినిమాకు సంబందించి టీజర్ ను రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇక తమిళ్ టీజర్ ను రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాకు సంగీతం కూడా రెహమాన్ అందించారు. టీజర్ చూస్తుంటే మొత్తం మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అని తెలుస్తోంది. 

ఇకపోతే మెరుపు కలలు - ప్రియురాలు పిలిచింది సినిమాలు తీసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ చాలా కాలం తరువాత మ్యూజికల్ మూవీతో వస్తుండడంతో కోలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. డిసెంబర్ లో ఒకేసారి తమిళ్ - తెలుగు భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది.