రూమర్స్ ఒక్కోసారి స్టార్ డైరక్టర్స్ ని సైతం షాక్ గురి చేస్తూంటాయి. ఎంత లైట్ తీసుకుందామన్నా ఆగలేరు. ఇప్పుడు రాజమౌళి అదే పరస్దితిలో ఉన్నాడని అంటున్నారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు కరోనా తో సమస్య వచ్చింది, రిలీజ్ అనుకున్న తేదీకు లేటు అవ్వకుండా ఏం చేయాలా అని టీమ్ తో తలములకలుగా ఉంటే...ఆయన తదుపరి చేయబోయే సినిమాపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన మర్యాద రామన్న లాంటి కామెడీ సినిమా, తన రెగ్యులర్ బడ్జెట్ కు పావు వంతులో చేయాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి. అంతేకాదు...ఈ సినిమాకు హీరో రామ్ పోతినేని అని కూడా ఫిక్స్ చేసేసారు. 

రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ అందుకు తగ్గట్టుగా ఓ కథను సిద్ధం చేస్తున్నాడని వార్తల సారాంశం. ఇందులోనే రామ్ హీరోగా నటిస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది.  అయితే రాజమౌళి కానీ,ఆయన టీమ్ కానీ రామ్ ని కలవలేదని, అలాంటి ఆలోచన ఏమీ చేయలేదని సమాచారం. అసలు ఎలా ఈ రూమర్ పుట్టిందా..ఇంత క్రియేటివ్ గా ఆలోచించి రూమర్ మొదలెట్టిన మహానుభావుడు ఎవరా అని రాజమౌళి ఆశ్చర్యపోతున్నార.  

ఇక బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

దాదాపుగా చాలా భాగం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ముందుగా సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.