మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ చాలా రహస్యంగా జరుగుతుంది. ప్రస్తుతం ఓ డేంజర్ లోకేషన్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతందట. ఇంతకీ సూపర్ స్టార్ ఎక్కడున్నారు?
ఇండియన్ సినిమాలో ఆడియన్స్ అంతా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సినిమా SSMB29. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తుంది కొత్త సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరో. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథతో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సినిమా అవుతుందని అంటున్నారు. దీని బడ్జెట్ 1000 కోట్లు దాటుతుంది. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ ఈ వారంలో మొదలు కానుంది.
అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్:
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నెల రోజుల కిందట రాజమౌళి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఈసినిమాకు ఇంకా టైటిల్ ను పెట్టలేదు, తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి 29 అని పిలుస్తున్నారు. మొదటి షెడ్యూల్లో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.
మల్లికా సుకుమారన్ కూడా ఈ విషయాన్ని నిజమని చెప్పారు. ఇక ఈసినిమా తరువాతి షెడ్యూల్ ను రాజమౌళి ఒడిశాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్లాన్ చేశాడ. ఈ నెల చివరి వరకు జరిగే ఈ షెడ్యూల్లో పృథ్విరాజ్ కూడా పాల్గొంటాడని సమాచారం అందుతోంది.
సాహసం చేయబోతున్న మహేష్ బాబు
ట్రెకింగ్ చేయడానికి వీలైన అటవీ ప్రాంతాల కోసం రాజమౌళి, అతని టీమ్ ఒడిశాలోని కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నారట. ఆఫ్రికన్ అడవుల్లా ఉండే డియోమాలి, కొరాపుట్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఇవన్నీ తూర్పు కనుమల్లో ఉన్నాయి. డియోమాలి ఒడిశాలో ఎత్తైన ప్రదేశం. ఇదిలా ఉంటే, మహేష్ బాబు ఒడిశాకు వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న వీడియో వైరల్ అయింది.
