మ్యాక్స్ వెల్ విధ్వంసంపై రాజమౌళి మ్యాడ్ పోస్ట్.. వైరల్..
ఆస్ట్రేలియా పని అయిపోయిందని అంతా అనుకున్నారు, పసికూన చేతిలో ఆసిస్ ఓటమీ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ సమయంలో వచ్చాడు మ్యాక్స్ వెల్. విధ్వంసం సృష్టించాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ విధ్వంసం గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయింది, కూన అఫ్గనిస్తాన్ ముందు ఓడిపోతుందని అంతా భావించారు. కానీ ఆ సమయంలో వచ్చిన మ్యాక్స్ వెల్ మ్యాజిక్ చేశాడు. అది మామూలు మ్యాజిక్ కాదు, ఊహకందని మ్యాజిక్, ఊహించలేని మ్యాజిక్, నమ్మలేని మ్యాజిక్, సంచలనాలకు తెరలేపే మ్యాజిక్. అవును. 2023 ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో ఆసిస్‌టార్గెట్ 292 పరుగులు. 91 పరుగులకే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయిన దశలో, టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిన దశలో మ్యాక్స్ వెల్ వచ్చాడు. ఆట రూపు రేఖలను మార్చేశాడు. గెలుపు ఈజీ అని భావించిన అఫ్గనిస్తాన్‌కి చుక్కలు చూపించారు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన మ్యాక్స్ వెల్ విజృంభించాడు. తన ఆటతో విశ్వరూపం చూపించారు. విధ్వంసకరమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాని అవలీలగా గెలిపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరికి మెంటల్ ఎక్కించాడు. అటు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కూడా నమ్మలేని విధంగా రెచ్చిపోయి ఓటమి నుంచి గెలుపు బాటలు వేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకి అద్భుతమైన విజయాన్ని అందించారు మ్యాక్స్ వెల్.
ఈ విజయం పట్ల ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఈ క్రమంలో తన సినిమాలతో ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి మ్యాక్స్ వెల్ ఆటతీరుపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. `మ్యాడ్ మాక్స్` అంటూ పోస్ట్ పెట్టారు. మ్యాక్స్ వెల్ పిచ్చెక్కించేలా ఆట ఆడాడని ఆయన వెల్లడించారు. అంతేకాదు తాను చూసిన ఇన్నింగ్స్ లో ఇదొక గొప్ప ఇన్నింగ్స్ అని వెల్లడించారు రాజమౌళి. ప్రస్తుతం జక్కన ట్వీట్ వైరల్ అవుతుంది.
ఇక రాజమౌళి `ఆర్ ఆర్‌ఆర్` తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం మహేష్‌బాబుతో తీయబోయే సినిమాపై వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్లని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మహేష్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.