దర్శకుడు రాజమౌళి.. తన ఫ్యామిలీతో కలిసి టూర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. వీడియో పంచుకోగా అది వైరల్‌ అవుతుంది.

దర్శక ధీరుడు రాజమౌళి.. త్వరలో మహేష్‌బాబుతో చేయాల్సిన సినిమాపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆయన రిలాక్స్ అయ్యే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన ఆథ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన టూర్‌ వెళ్లారు. తమిళనాడులో ఆయన ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా తాము తిరిగిన దేవాలయాలకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు జక్కన్న. 

రోడ్‌ ట్రిప్‌ని బాగా ఎంజాయ్‌ చేశారట. తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, చిరకాల కోరిక నెరవేరిందని వెల్లడించారు రాజమౌళి. `రోడ్‌ ట్రిప్‌ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. ఈ విషయంలో మా అమ్మాయికి ధన్యవాదాలు. జూన్‌ చివరి వారమంతా శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకథన్‌, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించామ`ని తెలిపారు. 

ఇంకా రాజమౌళి మాట్లాడుతూ, ఆ దేవాలయాల్లోని శిల్పకళ చూసి ఆశ్చర్యపోయాను. చోళుల కాలంలోనే ఎంతో గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ల ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రతిభ అందరినీ మంత్రముగ్దుల్ని చేస్తాయి. కుంభకోణంలోని కాకహోటల్‌, రామేశ్వరంలోని మురుగదాస్‌ హోటల్‌లో భోజనం ఎంతో రుచిగా ఉంది. నేను వారంలోనే 3 కేజీలు పెరిగాను. మూడు నెలల విదేశీ టూర్‌ తర్వాత మన దేశంలో ఇలా పుణ్యక్షేత్రాలు సందర్శించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింద`ని ట్వీట్‌ చేశారు రాజమౌళి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Scroll to load tweet…

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, `మీ డ్రీమ్‌ ప్రాజెక్ట్ `మహాభారతం` కోసం వెళ్లారా? అని, మధుర విజయంపై ఎప్పుడు సినిమా చేస్తారని అడుగుతున్నారు. ఇక రాజమౌళి.. నెక్ట్స్ మహేష్‌బాబుహీరోగా ఓ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నారు. అంతర్జాతీయ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది ఇది ప్రారంభం కానుంది.