హాట్ బ్యూటీ రెజీనా, మరో నటి నివేదిత సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ' అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్ జూలై 1న రిలీజ్ కానుంది.
ఓటిటి వేదికగా వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఓటిటి దిగ్గజ సంస్థ లన్ని సినిమాలకు ధీటుగా బలమైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఆహా ఓటిటిలో కూడా అనేక వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం అయింది.
హాట్ బ్యూటీ రెజీనా, మరో నటి నివేదిత సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ' అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్ జూలై 1న రిలీజ్ కానుంది. ఆహా ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా వెబ్ సిరీస్ ట్రైలర్ ని దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేశారు.
ఈ సిరీస్ ని ఆర్కా మీడియా సంస్థ, ఆహా కలిసి నిర్మించాయి. హర్రర్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. రెజీనా, నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హర్రర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
హర్రర్ చిత్రాల ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది అని అంటున్నారు. అక్కా చెల్లెళ్ళ మధ్య ఎం జరిగింది ? సైబర్ ప్రపంచం లోకి హర్రర్ ఎలా వచ్చింది అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ హర్రర్ చూపించాలంటే కష్టం. కానీ అందరికీ ఇదే నచ్చుతుంది. ఈ కథ వినగానే వెబ్ సిరీస్ రూపంలో చిత్రీకరించాలని అనుకున్నట్లు శోబు తెలిపారు.
నివేదితా సతీష్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు అమ్మాయిని. ఎప్పుడు తెలుగు లోగిళ్లలో అడుగు పెడతానా అని ఆలోచించాను. ఆ కల ఈరోజు నిజమైంది. ఆర్కా మీడియా, ఆహా సంస్థలు కలయికలో వస్తున్న అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాఉ. ఇన్నేళ్ల తర్వాత నా మాతృభాషలో అవకాశం వచ్చింది. అందరికీ అన్యాస్ ట్యుటోరియల్ నచ్చుతుందని, ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

