ఈ రోజు బాహుబలి లాస్ట్ వర్కింగ్ డే.. సంతోషం. కానీ బాధగా ఉంది-రాజమౌళి ట్వీట్
సినిమా పూర్తవడం అంటే రిలీజ్ కు రెడీ అవటం. ఒక సినిమా షూటింగ్ పూర్తయి, ప్రోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయి, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైనపుడే అది పూర్తయినట్లు. అప్పుడే సినిమాకు సంబంధించిన దర్శకుడికి విశ్రాంతి. మరి ఒక సినిమా కోసం ఐదేళ్ల పాటు పనిచేసి ఆ సినిమా కోసం పనిచేసే చివరి రోజు రావటమంటే... ఆ దర్శకునికి అది పండగలాంటి రోజు. కానీ ఆ పండగ లాంటి రోజును ముగించటం సంతోషమే అయినా బాధతో ముగిస్తున్నానని ట్వీట్ చేశాడు ఆ దర్శకుడు. అర్థమైంది కదా.. ఆ సినిమా బాహుబలి. ఆ దర్శకుడు రాజమౌళి.
బాహుబలి-2 సినిమాకు సంబంధించిన రాజమౌళికి ఈ రోజు.... లాస్ట్ వర్కింగ్ డే. ఈ సందర్భంగా రాజమౌళి ఈ రోజు ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 'లాస్ట్ వర్కింగ్ డే, అద్భుత జర్నీ .. మంచి అనుభవం.. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తయినందుకు ఎంతో ఆనందంగా ఉంది.. అయితే బాధగా కూడా ఉంది'... అంటూ ట్వీట్ చేసాడు జక్కన్న.
రాజమౌళి చేసిన ఈ ట్వీట్ కు అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. వేలాది మంది లైక్స్, కామెంట్స్, రీ ట్వీట్లతో ఆయనకు బెస్టాఫ్ లక్ చెప్పారు. రాజమౌళి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షించారు.
బాహుబలి సినిమా కోసం ఐదేళ్లుగా ఆయన అవిశ్రాంతంగా కష్టపడుతూనే ఉన్నారు. లార్జర్ దన్ లైఫ్ లాంటి సినిమాను ఇండియన్ ప్రేక్షకులకు అందించాలని కలలు కన్న ఆయన ఎట్టకేలకు తాను అనుకున్న పని పూర్తి చేసారు. ఎన్నో కష్టాలకు ఓర్చి... ఈ ఐదేళ్లు రాజమౌళి పడ్డ కష్టం గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఎవరూ పడనంత టెన్షన్, ఎవరికీ లేనన్ని బాధ్యతలు రాజమౌళి మోసారు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ‘బాహుబలి' అనే అద్భుతమైన సినిమాను ఆయన ప్రపంచానికి అందించారు.
