పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హుక్ స్టెప్ ఫేమస్ అయ్యింది. అయితే ఈ సాంగ్ కు రాజమౌళి, అనిల్ రావిపూడి కలిసి స్టెప్పులేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.
ఉద్యమ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఫిక్షన్ స్టోరీ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా ప్రిన్స్ రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఈ మల్టీస్టారర్ ఫిల్మ్ మార్చి 25న రిలీజ్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. అయితే ఈ సందర్భంగా నిన్న ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీని RRR టీం గ్రాండ్ గా నిర్వహించింది.
అయితే ఈ పార్టీలో రాజమౌళి (Rajamouli) గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ నుంచి ముఖ్యంగా ‘నాటు నాటు’ (Naatu Naatu Song) ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ మేకింగ్ ను ఉక్రెయిన్ లో రెండు వారాల పాటు చేశారు. అయితే సాంగ్ షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే సింక్ లో ఆడాలని రాజమౌళి బాగా ఇబ్బందిపెట్టాడని తారక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బదులుగా రాజమౌళి కూడా నాటు నాటుకు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ చేశాడు. దీంతో రాజమౌళి తప్పకుండా చేస్తానని వాగ్దానం చేశాడు.
అప్పుడు ఎన్టీఆర్ కు ఇచ్చిన మాటను సక్సెస్ పార్టీలో నిలబెట్టుకున్నాడు. పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో కలిసి ‘నాటు నాటు’ సాంగ్ హుక్ స్టెప్పును వేశారు. జక్కన్న, అనిల్ ఇద్దరు కలిసి మాస్ స్టెప్పులేస్తుంటే... అక్కడే ఉన్న ఎన్టీఆర్, చరణ్, నిర్మాత దిల్ రాజు ఎంజాయ్ చేశారు. వారిద్దరి ప్రతిభను ప్రశంసించారు. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు. సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ మరియు శ్రియా శరణ్ సహాయక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
