సినిమా రిలీజ్ లపై హీరో,హీరోయిన్స్ పర్శనల్ సమస్యల ప్రభావం కూడా పడుతూంటుంది. షూటింగ్ లో ఉండగా హీరో లేదా హీరోయిన్ చనిపోతే ఆ సానుభూతి ఓ రేంజిలో ప్రవహించి, సినిమాని నిలబెట్టేస్తుంది. అదే రిలీజ్ టైమ్ లో ఏదన్నా సమస్యలు వారిని చుట్టుముడితే అవి ఖచ్చితంగా ప్రమోషన్, రిలీజ్ పై ఇంపాక్ట్ చూపెడతాయి. గత కొద్ది రోజులుగా  బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సడక్ 2’ సినిమాపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది.

 ఎప్పుడూ లేనంత విధంగా ఈ చిత్రం ట్రైలర్ కు రికార్డు స్థాయిలో డిస్ లైకుల మోత మోగుతోంది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం అని అతడి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. దీనితో స్టార్ కిడ్స్ సినిమాలను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు.డిస్ లైక్స్ లో నంబర్ వన్ ఏది? అని ఆరా తీస్తే.. జస్టిన్ బీబర్ పాట `బేబీ` కోసం 11.6 మిలియన్ల మంది అయిష్ఠతను వ్యక్తం చేశారు. ఆ తరవాత సడాక్ -2 కు 9.04 మిలియన్ డిస్ లైక్ లు వచ్చాయి. 

ఈ నేపధ్యంలో రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న అలియా భట్ పై ఆ ఇంపాక్ట్ ఎంత కాలం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ ఇప్పుడిప్పుడే లేదు కాబట్టి...వచ్చే సంవత్సరం థియోటర్ రిలీజ్ నాటికి జనం ఈ విషయం మర్చిపోతారని రాజమౌళి నమ్ముతున్నారట. లేకపోతే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఈ చిత్రం బాలీవుడ్ బిజినెస్ పడుతుందనటంలో సందేహం లేదు.