దర్శకుడు రాజమౌళి సడన్ గా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తి నెలకొంది. నేడు తాడేపల్లి వచ్చిన రాజమౌళి ఆయనను కలిశారు. సీఎంతో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) మూవీ మార్చి 25న గ్రాండ్ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితులు ఉండేలా రాజమౌళి చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా మార్చి 14న ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు ఆయన అప్పోయింట్మెంట్ తీసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్య తో పాటు సీఎం జగన్ తో ఆయన భేటీ అయ్యారు.

భేటీ అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే భారీ బడ్జెట్ మూవీ కావడంతో అవసరమైన చర్యలు, ప్రయోజనాలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా తక్కువ సమయం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. బెనిఫిట్ షోల గురించి అడిగితే తెలియదు అన్నారు. 

రాధే శ్యామ్ మూవీ విడుదలతోనే ఏపీలో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. పాత రేట్లను పునరుద్దరిస్తూ కొత్త రేట్లతో కూడిన జీవోని ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అత్యధికంగా రూ. 275 గా టికెట్స్ ధరలను ఏపీ ప్రభుతం నిర్ణయించింది. అయినప్పటీకీ రాజమౌళి సీఎం ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఆర్ ఆర్ ఆర్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. ఓవర్ సీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ బుకింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వన్ మిలియన్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రెండు వారాలు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ దక్కడం ఆర్ ఆర్ ఆర్ మూవీపై అక్కడి ప్రేక్షకులకున్న క్రేజ్ అర్థమవుతుంది. తెలుగు సినిమాలకు మార్కెట్ ఉన్న ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో కూడా బుకింగ్స్ ఇదే స్థాయిలో ఉన్నాయి. 

కాగా యూఎస్ తర్వాత ఆస్ట్రేలియా తెలుగు సినిమాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ఆస్ట్రేలియా రైట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. భారీ డిమాండ్ ఏర్పడగా పోటీ మధ్య సుమారు రూ 6.5 కోట్లకు ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు చేజిక్కించుకున్నారట. పూర్తి పాజిటివ్ బజ్ నెలకొన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్ట్రేలియాలో కూడా రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. దీంతో పెట్టుబడితో పాటు మంచి లాభాలు దక్కించుకోవడం లాంఛనమే అని చెప్పాలి. తెలివిగా చివరి నిమిషంలో ఆర్ ఆర్ ఆర్ హక్కులు దక్కించుకొని నాగవంశీ మరో ప్రాఫిటబుల్ వెంచర్ తన ఖాతాలో వేసుకున్నారు. 

 ఎన్టీఆర్-చరణ్ ల మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. ఓవర్ సీస్ లో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ మొదలైపోయాయి. యూఎస్ తో పాటు పలు దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. యూఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ మార్క్ కూడా దాటేశాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.