Asianet News TeluguAsianet News Telugu

మహేష్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి!

 అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి మహేష్ మూవీపై స్పందించారు. ఫ్యాన్స్ కి  అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన కెరీర్లోనే అతిపెద్ద చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. 
 

rajamouli gives crazy update on his next with mahesh babu
Author
First Published Oct 1, 2022, 8:24 PM IST

రాజమౌళి అమెరికాలో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నందు ఆర్ ఆర్ ఆర్ మూవీని ప్రదర్శించారు. కాగా రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. మూవీ ముగిశాక చప్పట్లతో రాజమౌళిని అభినందించారు. ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన అనంతరం రాజమౌళి ఆడియన్స్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మహేష్ తో తాను చేయబోయే మూవీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో ఎన్నడూ చేయని జోనర్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా కథగా ఈ మూవీ ఉంటుంది అన్నారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ అత్యధికంగా రూ. 400 నుండి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కనున్న మహేష్ చిత్ర బడ్జెట్ అంతకు మించి ఉండదనుంది. రాజమౌళి చిత్రం అంటే రికార్డులు బ్రేక్ అవుతాయి. కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. కాబట్టి నిర్మాతలు ఎంత పెట్టుబడి పెట్టడానికైనా వెనకాడరు. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. ఇక మహేష్ సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఆతృతగా ఉన్నానని గతంలో చెప్పారు. దాదాపు రెండు నుండి మూడేళ్లు మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. 

ఇక మహేష్ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. రాజమౌళి మాటల ప్రకారం మహేష్ ని జేమ్స్ బాండ్ రేంజ్ లో చూపిస్తాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios