లైన్ ప్రొడ్యూసర్ గా పాఠాలు నేర్చుకొని ఇప్పుడు డైరెక్ట్ గా నిర్మాతగా మారుతున్నాడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్.కార్తికేయ. అతని మొదటి సినిమా ఆకాశవాణి పోస్టర్ ని కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఇక రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ ప్రయోగాత్మకమైన సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. పీరియాడిక్ డ్రామాగా సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను రీసెంట్ గా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జక్కన్న లిమిట్ లో సినిమాకు ఖర్చు చేయాలని షరతులు విధించినట్లు టాక్. ఇక టోటల్ గా 5 కోట్ల వరకు ఈ సినిమా భడ్జెట్ ను కేటాయించారని వినికిడి. పూర్తిగా నూతన నటీనటులు సినిమాలో నటిస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సెట్స్ కి ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ముందుగానే అన్ని చర్చలు జరిపిన అనంతరం బడ్జెట్ విషయంలో జక్కన్న ఒక గీత గీసి ఆ లిమిట్ క్రాస్ కాకుండా చూసుకోవాలని చెప్పి తనయుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టనున్నాడు. సినిమా పనుల విషయంలో ఎప్పటికప్పుడు రాజమౌళి తండ్రి  విజయేంద్ర ప్రసాద్ ఆకాశవాణి టీమ్ తో చర్చలు జరిపి వారికి సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.