బాహుబలి 2లో అనుష్క లుక్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి అనుష్క గ్లామర్ అద్దిరిపోయేలా ఉండాలని అభిమానుల ఆకాంక్ష బొద్దుగుమ్మగా మారిన అనుష్క బాహుబలిలో మల్లెతీగలా కనిపిస్తుందా రాజమౌళి అనుష్కను అలా చూపించేందుకు ఏ మంత్రం వేస్తున్నాడు
బాహుబలి 2 సినిమాకు సంబంధించి ప్రేక్షకులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది. అయితే గత నాలుగేళ్లుగా ఈ. ప్రశ్న వేధిస్తుంటే.. గత నెల రోజులుగా.. మరో ప్రశ్న కూడా అభిమానులను వేదిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన అబిమానులు రాజమౌళి ఈ సినిమాలో అనుష్కను ఎలా చూపించబోతున్నాడో అని ఎదురుచూస్తున్నారు. బాహుబలి తొలి భాగంలో డీ గ్లామర్ రోల్ లో కనిపించిన అనుష్క ఈసారైనా గ్లామరస్ లుక్ లో కనిపిస్తుందో లేదోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల విడుదలైన సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల రిలీజ్ తరువాత అనుష్క అందాల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. బాహుబలి2 సినిమాలో అనుష్క మహారాణీగా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న లుక్ లో రాణీగా చూపిస్తే ఎలా ఉంటుంది అని అంతా డౌట్ పడుతున్న సమయంలో బాహుబలి 2లో అనుష్క లుక్ పై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
శివరాత్రి సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో మాట్లాడుతూ... రెండో భాగంలో అనుష్క కనిపించే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో అయిపోయిందట. ఇటీవల జరిగిన షూటింగ్ లో కొన్ని షాట్స్ మాత్రమే చిత్రీకరించామన్న రాజమౌళి, అనుష్క లుక్ ఫస్ట్ లుక్ లో కనిపించినంత గ్లామరస్ గానే ఉంటుందని హామీ ఇచ్చాడు. దాని కోసం అవసరమైన మేరకు టీమ్స్ చెక్కుడు పనిచేస్తున్నాయని స్పష్టం చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి2 సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అప్పటి వరకు అన్ని పనులు పూర్తయి సిద్ధమవుతుందో లేదో చూడాలి.
