కుటుంబ సభ్యులందరు కలిసి రాజమౌళి కి ఇంటికి రాగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. భారీ కేక్ ని తీసుకొచ్చి కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
#RRR మూవీ కి ఆస్కార్ సెలబ్రేషన్స్ ప్రతీ తెలుగువారు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈవెంట్ ని ముగించుకొని మూవీ టీం హైదరాబాద్ కి వచ్చినప్పుడు అభిమానులు బేగంపేట్ విమానాశ్రయం కి చేరుకొని ఘన స్వగతం పలికారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ఆయన వస్తున్నట్టు అభిమానులకు ఎలాంటి సమాచారం లేదు. తెల్లవారు జామున 3 గంటలకు వచ్చాడు. అయినా కానీ అక్కడకి అశేషం గా అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చాడు, ఆయనకీ కూడా అదే స్దాయిలో ఆహ్వానం దక్కింది. ఇక రాజమౌళి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయనకీ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం అనేది ఊహించిందే. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయనకీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అంతేకాదు కుటుంబ సభ్యులందరు కలిసి రాజమౌళి కి ఇంటికి రాగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. భారీ కేక్ ని తీసుకొచ్చి కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఆదివారం నాడు కాల భైరవ స్నేహితులతో కలిసి RRR సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చరణ్ RC 15 సెట్ లో RRR ఆస్కార్ సెలబ్రేషన్స్ ని చేసుకున్నాడు. తాజాగా రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు ఆదివారం రాత్రి రాజమౌళి ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, సన్నిహితులు, చుట్టుపక్కల ఫ్యామిలీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీరవాణి కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. ఆస్కార్ తో వచ్చినందుకు స్వాగతం చెప్తూ, అభినందిస్తూ బ్యానర్స్ కూడా ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. రాజమౌళి ఇంటి సెల్లార్ లో ఈ సెలబ్రేషన్స్ జరిగినట్టు సమాచారం. అనంతరం ఓ చిన్నపాటి పార్టీ కూడా ఏర్పాటు చేశారు.
