ప్రభాస్ సలార్ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి భాగం కాబోతున్నారు అంటూ కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. సలార్ టీమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లని రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సలార్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఇటీవల సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ట్రైలర్ సంతృప్తినివ్వలేదు. ఎక్కువగా సన్నివేశాలన్నీ కేజీఎఫ్ చిత్రాన్ని పోలి ఉన్నాయి. 

దీనితో ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తి కూడా పెరుగుతోంది. నిజంగానే సలార్ కి, కేజీఎఫ్ మధ్య సంబంధం ఉందా అని అంతా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. 

ప్రభాస్ సలార్ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి భాగం కాబోతున్నారు అంటూ కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. సలార్ టీమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లని రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. 

Scroll to load tweet…

రాజమౌళి తనదైన స్టైల్ లో జోవియల్ గా మాట్లాడుతూనే సలార్ సీక్రెట్స్ మొత్తం లాగే ప్రయత్నం చేశారు. సలార్,కేజిఎఫ్ మధ్య నిజంగానే కనెక్షన్ ఉందా ని రాజమౌళి ప్రశ్నించడం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఒక విషయంలో తాను డిసప్పాయింట్ అయ్యాయని కూడా జక్కన్న అంటున్నారు. కెజిఎఫ్, సలార్ గురించి రాజమౌళి ప్రశ్నించగా.. తిరిగి ప్రభాస్ బాహుబలి 3 ఉందా అని అడుగుతున్నాడు. కంప్లీట్ ఇంటర్వ్యూ త్వరలోనే రానుంది.