సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల వెండితెరపై సూపర్ హిట్ జోడి మాత్రమే కాదు.. అంతకు మించిన అన్యోన్య దంపతులు కూడా. పలు చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ చాలా చిత్రాల్లో నటించారు.1967లో తెరకెక్కిన సాక్షి చిత్రంతో కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు ఉన్నాయి. 

బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్ర షూటింగ్ గోదావరి గట్టున జరిగింది. పులిదిండి గ్రామంలో కృష్ణ, విజయనిర్మలపై ఓ సాంగ్ షూట్ చేశారు. మీసాల కృష్ణుడి గుడిలో కృష్ణ, విజయనిర్మల నవదంపతులుగా కనిపిస్తారు. వీరిద్దరిపై కమెడియన్ రాజబాబు అప్పట్లోనే సరదాగా జోక్ చేశారట. ఈ గుడికి చాలా మహిమ ఉంది. ఇక్కడ జరిగే సంఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతాయి అని కామెంట్ చేశారు. 

సరిగ్గా రెండేళ్ల తర్వాత 1969లో కృష్ణ, విజయ నిర్మల వివాహబంధంతో ఒక్కటి కావడం విశేషం. కృష్ణ, విజయ నిర్మల గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరిద్దరూ మూడుసార్లు వివాహం చేసుకున్నారని చెబుతుంటారు. తిరుపతిలో జరిగినదే అధికారిక వివాహం.